రఘునందన్‌,‌ కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం

తాజా వార్తలు

Updated : 18/11/2020 15:01 IST

రఘునందన్‌,‌ కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం

హైదరాబాద్‌: దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్‌ రావు, గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్‌తో.. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని