రేవంత్ చిన్నపిల్లవాడు: కోమటిరెడ్డి

తాజా వార్తలు

Updated : 11/07/2021 16:16 IST

రేవంత్ చిన్నపిల్లవాడు: కోమటిరెడ్డి

దిల్లీ: తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని.. పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరు. రేవంత్‌ చిన్నపిల్లవాడు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పా. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతా’’ అని కోమటిరెడ్డి అన్నారు. 

కిషన్‌రెడ్డితో భేటీ 

అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కోమటిరెడ్డి ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.  భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని