‘కొడాలి వ్యాఖ్యలు ఆ ఉద్దేశాన్ని బయటపెట్టాయి’

తాజా వార్తలు

Updated : 08/09/2020 15:46 IST

‘కొడాలి వ్యాఖ్యలు ఆ ఉద్దేశాన్ని బయటపెట్టాయి’

దిల్లీ: అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశాన్ని బట్టబయలు చేశాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయన్నారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామని బెదిరిస్తున్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై అమరావతి రైతులు హైకోర్టులో అదనపు అపిడవిట్‌ దాఖలు చేస్తే మంచిదని రఘురామకృష్ణరాజు సూచించారు. 

శ్రీకాకుళంలో కాదు.. కడపలో మొదలుపెట్టండి

ఉచిత విద్యుత్‌ నగదు బదిలీపై రైతులకు సందేహాలు, అపోహలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రజలకు నగదు బదిలీపై నమ్మకం కలగడం లేదని చెప్పారు. ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకాన్ని శ్రీకాకుళంలో కాకుండా కడపలో మొదలు పెట్టాలని ఎంపీ సూచించారు. అక్షరాస్యతలో ఏపీ చివరిస్థానంలో నిలవడం విచారకరమన్నారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలో సిట్ ఏర్పాటు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని