రెండు పడక గదుల హామీ ఏమైంది?:రేవంత్‌

తాజా వార్తలు

Published : 06/09/2020 01:00 IST

రెండు పడక గదుల హామీ ఏమైంది?:రేవంత్‌

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ పరిధిలో కనీసం 10 లక్షల మంది నివాసం లేనివారు ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటి వరకు 128 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో డివిజన్‌ యాత్ర చేపట్టానని, తెరాస విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని పేర్కొన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం,వరంగల్‌ ఎన్నికల్లో పురపాలక మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని