ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

తాజా వార్తలు

Published : 25/10/2020 02:23 IST

ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

సిద్దిపేట: ఐదేళ్ల తెరాస పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా జిల్లాలోని దౌల్తాబాద్‌లో మంత్రి ప్రసంగించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,16,000 ఇస్తున్నామన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం.. భాజపా వాళ్లు ఇస్తారా?అని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు మాత్రమే కాంగ్రెస్, భాజపా నాయకులు వస్తారని.. ప్రజల కష్టసుఖాల్లో ఎప్పటికీ తోడుండేది తెరాస పార్టీయేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని