close

తాజా వార్తలు

Published : 22/11/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మజ్లిస్‌తో ఒప్పందమా..ఎక్కడ?: కేటీఆర్‌

హైదరాబాద్‌: గెలుపు అవకాశాల మేరకే జీహెచ్‌ఎంసీలో కొంతమంది అభ్యర్థులను మార్చామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అసంతృప్తులు ఉండటం అత్యంత సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. గెలిచే సీట్లలో ఆశావహులు ఎక్కువగా ఉంటారని, అదే సమయంలో అసమ్మతి నేతలను ఒప్పించి ముందుకెళ్లాల్సిన అవసరముంటుందన్నారు. ఈటీవీ తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో కేటీఆర్‌ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు. తెరాస విధానపరమైన నిర్ణయాలకు మాత్రమే మజ్లిస్‌ మద్దతిస్తోందని.. తాము కూడా గతంలో ఇదే తరహాలో భాజపాకు సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం పోటీ చేసిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలిపామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌లో తమపై ఎంఐఎం పోటీ పెట్టిందని.. తమ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ను ఓడించే పనిచేశారన్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలో తెరాస ఐదు సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. మజ్లిస్‌తో స్నేహపూర్వక ఒప్పందం ఎక్కడుందని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో పట్టణీకరణను ప్రోత్సహిస్తున్నామని.. హైదరాబాద్‌పై భారం తగ్గించేందుకు టౌన్‌షిప్‌ పాలసీ తీసుకొచ్చామని ఆయన వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.