మాటల యుద్ధం:కొడాలి నాని×దేవినేని ఉమ 

తాజా వార్తలు

Published : 05/09/2020 02:07 IST

మాటల యుద్ధం:కొడాలి నాని×దేవినేని ఉమ 

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటలయుద్ధం జరిగింది. మీడియా సమావేశంలో వేర్వేరుగా ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తొలుత వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని..దేవినేనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. తనజోలికి వస్తే మాటల్లో కాకుండా చేతల్లో చూపుతానంటూ దేవినేని ఉమను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అనంతరం తెదేపా కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమ మీడియా సమావేశం నిర్వహించి కొడాలి నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే కొడాలి నాని ఈవిధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలపై డీజీపీ సుమోటోగా చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్‌ చేశారు. తనకు భవిష్యత్‌లో ఏం జరిగినా సీఎందే బాధ్యతన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని