‘‘అప్పటివరకు పండగలు జరుపుకోనివ్వరా?’’ 

తాజా వార్తలు

Published : 18/08/2020 02:20 IST

‘‘అప్పటివరకు పండగలు జరుపుకోనివ్వరా?’’ 

రాజా సింగ్‌

హైదరాబాద్‌: వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. పండగకు నాలుగు రోజులే ఉందనగా ఇప్పుడు చెప్పడమేంటి? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా గణేశ్‌, నవరాత్రి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలంటున్న ప్రభుత్వం మరి బక్రీద్‌కు ఎలా అనుమతి ఇచ్చారని రాజాసింగ్‌ నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతారన్నారు. 

కరోనా వైరస్‌ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని.. అప్పటి వరకు హిందూ పండగలు జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. కరోనాకు జాగ్రత్తలు తీసుకుంటూనే గణేశ్‌ ఉత్సవాలకు అనుమతించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ధూల్‌పేట గణేశ్‌ విగ్రహ తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్ష మట్టి గణేష్‌ విగ్రహాలను పంచుతామని ప్రకటించిన ప్రభుత్వం.. ధూల్‌పేటలో తయారైన విగ్రహాలన్నీ కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని