ఎన్నికల నిర్వహణపై చర్చించాలి:రఘురామ

తాజా వార్తలు

Published : 11/10/2020 01:19 IST

ఎన్నికల నిర్వహణపై చర్చించాలి:రఘురామ

దిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థ మీద వైకాపాకు నమ్మకం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై కులం ముద్ర వేసి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 
నిమ్మగడ్డ రమేష్‌తో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్‌ చేశారు.

‘‘మాన్సస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలపై పూర్వ విద్యార్థులు ఆందోళన చేయాలి. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నిరసనలు తెలియజేయండి. న్యాయస్థానాలలో కేసులు వేసి పోరాడండి. న్యాయం జరుగుతుంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు నిజాయతి ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని