నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

Published : 27/10/2020 00:56 IST

నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

ఆకివీడు గ్రామీణం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ ‌వెళ్లారు. ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్‌ జారింది. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే వేరే ట్రాక్టర్‌ తెప్పించి పర్యటన కొనసాగించారు. అనంతరం ఆకివీడులోని పునరావాస కేంద్రాన్ని లోకేశ్‌ సందర్శించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని