భయపడేది లేదు.. రాహుల్‌ గాంధీ

తాజా వార్తలు

Updated : 02/10/2020 11:13 IST

భయపడేది లేదు.. రాహుల్‌ గాంధీ

ఇంటర్నెట్‌ డెస్క్: తాను ఎవరికీ భయపడనని, ఏ అన్యాయానికీ తలొగ్గనంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా అన్నారు. ‘‘నేను ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడను. ఏ విధమైన అన్యాయానికీ తలవంచను. అబద్ధాలను.. సత్యానికి ఉన్న శక్తితో జయిస్తాను.  అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను ఎదుర్కొంటాను. గాంధీ జయంతి సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

రాహుల్‌, ప్రియాంకలతో సహా ఉత్తర్‌ ప్రదేశ్‌ హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హాథ్రస్‌ ఘటన పట్ల దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని