నవంబరు 16న నితీశ్ ప్రమాణస్వీకారం!

తాజా వార్తలు

Published : 12/11/2020 18:05 IST

నవంబరు 16న నితీశ్ ప్రమాణస్వీకారం!

పట్నా: బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ వరుసగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. నవంబరు 16న  సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. భాయీ దూజ్‌ను పురస్కరించుకుని సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. అయితే తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. మంత్రివర్గ కూర్పుపై భాజపా, జేడీయూ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నీతీశ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, జేడీయూ ఇతర నేతలతో నేడు సమావేశం కానున్నారు. 

 ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని,  నీతీశే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఇప్పటికే భాజపా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 
 
ఇటీవల వెలువడిన బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాలుండగా.. ఎన్డీయే కూటమి 125 సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు సాధించింది. అయితే 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. భాజపా 74 స్థానాల్లో గెలుపొందింది. జేడీయూ 43 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని