బిహార్‌ సీఎం నితీశ్‌కుమారే: భాజపా

తాజా వార్తలు

Updated : 11/11/2020 15:03 IST

బిహార్‌ సీఎం నితీశ్‌కుమారే: భాజపా

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్‌ కుమారే ఉంటారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని భాజపా స్పష్టం చేసింది. సీఎం విషయంలో ఎలాంటి సందిగ్ధతకు తావులేదని, నితీశ్ స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరని పేర్కొంది. 

ఎన్నికల ఫలితాల్లో జేడీయూ మూడో స్థానానికి పడిపోవడంతో నితీశ్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. గత రెండు దశాబ్దాల్లో మొదటిసారిగా బిహార్‌లో ఎన్డీయే కూటమిలో భాజపా ప్రధాన శక్తిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో నితీశ్‌ను సీఎంగా కొనసాగించేందుకు భాజపా అంగీకరిస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే దీనిపై బిహార్‌ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశిల్‌ కుమార్‌ మోదీ తాజాగా స్పందించారు. బిహార్‌కు ముఖ్యమంత్రిగా నితీశే ఉంటారని స్పష్టం చేశారు. 

‘ఎన్నికల ముందు నాటి మాటకు మేం కట్టుబడి ఉన్నాం. సీఎం విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. నితీశ్‌జీ సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆయన స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. ఎన్నికల్లో ఒకరికి ఎక్కువ సీట్లు వస్తాయి.. మరొకరికి తక్కువ సీట్లు వస్తాయి. కానీ కూటమిలో మేం సమాన భాగస్వాములం’ అని సుశిల్‌ మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్డీయేపై విశ్వాసం చూపించిన బిహార్‌ ఓటర్లకు సుశిల్‌ ధన్యవాదాలు తెలిపారు. సుశిల్‌ వ్యాఖ్యలతో బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై కాస్త స్పష్టత వచ్చినట్లయింది.

ఇవీ చదవండి..

12 ఓట్లతో గెలిచేశాడు

నితీశ్‌ సీఎం అయితే.. ఆ క్రెడిట్‌ శివసేనదే

బిహార్‌ కిక్కు.. ఏ పార్టీకి ఎంతAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని