కృష్ణా వరద:చంద్రబాబు నివాసానికి నోటీసులు

తాజా వార్తలు

Published : 27/09/2020 22:15 IST

కృష్ణా వరద:చంద్రబాబు నివాసానికి నోటీసులు

అమరావతి: కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసముంటున్న ఇంటికి స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు అతికించారు. ఎగువ నుంచి సుమారు 5లక్షల క్యూసెక్కులపై పైగా వరద వస్తుండటంతో కృష్ణా కరకట్టపై ఉన్న నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికీ నోటీసులు అతికించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాకుండా అప్రమత్తంగా ఉండాలని మాత్రమే నోటీసుల్లో అధికారులు సూచించారు. వరద ప్రవాహం దృష్ట్యా గతంలోనూ ఇదే తరహాలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

కృష్ణా నదికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని