తెదేపా నేత హత్య కేసులో ఎమ్మెల్యే పేరు?

తాజా వార్తలు

Published : 31/12/2020 01:34 IST

తెదేపా నేత హత్య కేసులో ఎమ్మెల్యే పేరు?

ముగ్గురు పేర్లు చేరుస్తామని తెలిపిన పోలీసులు
లోకేశ్‌ సమక్షంలో అపరాజిత వాంగ్మూలం నమోదు

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసు వ్యవహారంలో ఎమ్మెల్యే సహా మరో ఇద్దరి పేర్లు చేర్చేందుకు పోలీసులు అంగీకరించారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ సుబ్బయ్య భార్య అపరాజిత డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దుటూరు వెళ్లిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆమె ఇదే విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో లోకేశ్‌ సహా తెదేపా నేతలు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఆ ముగ్గురి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదంటూ ధర్నా కొనసాగించారు. 

మధ్యలో డీఎస్పీ వచ్చి ఆందోళన విరమించాలని లోకేశ్‌ను కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో 161 సెక్షన్‌ ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను కేసులో చేరుస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు లోకేశ్ తెలిపారు. అనంతరం డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నమోదు చేసిన వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ ప్రసాదరావు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

అంతవరకూ ప్రొద్దుటూరు వీడేది లేదు: లోకేశ్‌

‘న్యూ ఇయర్‌’.. హైదరాబాద్‌లో ఆంక్షలు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని