ఎన్డీయేకు మరో పార్టీ షాక్‌!

తాజా వార్తలు

Published : 26/12/2020 19:11 IST

ఎన్డీయేకు మరో పార్టీ షాక్‌!

దిల్లీ: భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి మరో పార్టీ వైదొలిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌ బేనీవాల్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) కూటమి నుంచి బయటకొచ్చింది. నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు బేనీవాల్‌ ప్రకటించారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించేవారి పక్షాన తాము ఉండబోమని తెలిపారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో నిర్వహించిన రైతుల ఆందోళన కార్యక్రమంలో ఈ మేరకు బేనీవాల్‌ ప్రకటన చేశారు.

భాజపా నుంచి వైదొలిగిన బేనీవాల్‌.. 2018లో రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆర్‌ఎల్‌పీని స్థాపించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి కూటమిలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని శివసేన ఎన్డీయేకు దూరం అవ్వగా.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని అకాలీదళ్‌ సైతం కూటమిని వీడింది. తాజాగా ఆర్‌ఎల్‌పీ కూటమిని వీడడంతో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన పార్టీల సంఖ్య మూడుకు చేరింది.

ఇవీ చదవండి..
చర్చలకు వస్తాం..రైతు సంఘాలు
అమోఘం..అద్భుతం..చైనా నేతల సొంతడబ్బా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని