టైటానిక్‌ పరిస్థితే: రాహుల్ 

తాజా వార్తలు

Published : 09/09/2020 01:05 IST

టైటానిక్‌ పరిస్థితే: రాహుల్ 

దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు. సరిహద్దులో భారత్, చైనా వివాదం, ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ దేశాన్ని టైటానిక్ నావతో పోల్చారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో వర్చువల్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న రాహుల్‌ విమర్శలు చేశారు. 

‘మీడియా, నరేంద్ర మోదీ ఈ అంశాలను పక్కదోవ పట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నా.. వాటిని దాచలేరు. ప్రజలు ఇయర్‌ ప్లగ్స్‌ ధరించారు. నిరుద్యోగం, చొరబాట్లు, ఆర్థిక వ్యవస్థ.. వీటితో దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. టైటానిక్‌ నౌక మంచుకొండను ఢీకొట్టి, ముక్కలుగా విరిగిపోయినట్లే, ఇవన్నీ ఒక్కసారిగా బయటపడతాయి. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి ఎటువంటి చొరబాట్లు లేవని ఎలా చెప్పగలరు? మనం సమస్యలను లేవనెత్తాలి’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా.. పార్టీ నాయకత్వం, తదితర సమస్యలను ప్రస్తావిస్తూ కొందరు అసమ్మతి నేతలు సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారిపై పార్టీ గుర్రుగా ఉంది. వారిలో కొందరు ఈ సమావేశానికి హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని