మోదీజీ..ఇంకెంతమంది మరణిస్తే దిగొస్తారు?
close

తాజా వార్తలు

Updated : 12/12/2020 15:58 IST

మోదీజీ..ఇంకెంతమంది మరణిస్తే దిగొస్తారు?

11 మంది రైతులు మృతి చెందడంపై కాంగ్రెస్ ఆగ్రహం

దిల్లీ: 17 రోజులుగా జరుగుతోన్న రైతు ఆందోళనల్లో భాగంగా 11 మంది రైతులు మరణించడంపై శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటే రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయాలి?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. రైతుల మరణాలపై వచ్చిన మీడియా కథనాన్ని షేర్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ‘17 రోజుల్లో 11 మంది రైతు సోదరులు అమరులయ్యారు. అయినా, మోదీ ప్రభుత్వం పశ్చాత్తాపం చెందడం లేదు. ప్రభుత్వం ఇప్పటికీ ఆహారాన్ని పండించేవారితో కాకుండా, డబ్బు అందించేవారితోనే ఉంది. రాజ్యాంగ బాధ్యత గొప్పదా?, మొండితనం గొప్పదా? అని ఈ దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

కేంద్రం సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 17 రోజులుగా అన్నదాతలు తమ శాంతియుత నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ..అవి కొలిక్కి రాకపోవడంతో, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 14న దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. సవరణల ప్రతిపాదనను తిరస్కరించి, చట్టాలను రద్దు చేసేవరకూ తమ ఆందోళనను ఆపమంటూ భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు, నిరసన ఆపాలంటూ ప్రభుత్వం రైతు సంఘాలను కోరుతోంది.

ఇవీ చదవండి:

రైతుల ఆదాయం పెంచడానికే కొత్త చట్టాలు: మోదీ

రోడ్ల దిగ్బంధానికి కదం తొక్కిన రైతులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని