సీఎం గారూ.. పంటనష్టం తీవ్రత అర్థంకావట్లేదా? 

తాజా వార్తలు

Published : 20/08/2020 01:12 IST

సీఎం గారూ.. పంటనష్టం తీవ్రత అర్థంకావట్లేదా? 

కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన పంటల నష్టం తీవ్రత అర్థం కావడం లేదా? అని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. నష్టపోయిన రైతులకు రూ.20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లింపు కోసం కోసం తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. రైతులు మళ్లీ పంట వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని