దేశం మొత్తం మీ వెంటే: సచిన్‌ పైలట్

తాజా వార్తలు

Published : 13/09/2020 01:28 IST

దేశం మొత్తం మీ వెంటే: సచిన్‌ పైలట్

చైనా దురాక్రమణ కట్టడికి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే

జైపూర్‌: ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలపై కేంద్రం మీద కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మరోనేత సచిన్‌ పైలట్ సమర్థించారు. శనివారం పైలట్ మీడియాతో మాట్లాడుతూ..భారత్, చైనా సరిహద్దు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఇతర విషయాలను ప్రస్తావిస్తుందంటూ మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీజీ లేవనెత్తిన అంశాలు సమర్థనీయమైనవి. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. 2.10 కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల్లో కోత విధిస్తున్నారు. మరోవైపు చైనా మన భూభాగంలోకి ప్రవేశిస్తోంది. భారత్, చైనా సరిహద్దు వివాదంపై ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ఇతర విషయాల గురించి మాట్లాడుతోంది’ అంటూ ఆయన విమర్శలు చేశారు. అలాగే చైనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దేశం మొత్తం వెంట ఉంటుందన్నారు. 

శనివారం రాహుల్ గాంధీ ట్విటర్‌ వేదికగా కరోనా వైరస్‌ కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలన్నింటిని పక్కనబెట్టి అంతాబాగానే ఉందంటూ ప్రభుత్వం, మీడియా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని