స్పీకర్‌కు సచిన్‌ పైలట్‌ జన్మదిన శుభాకాంక్షలు!

తాజా వార్తలు

Published : 29/07/2020 13:53 IST

స్పీకర్‌కు సచిన్‌ పైలట్‌ జన్మదిన శుభాకాంక్షలు!

జైపుర్‌: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్‌ పైలట్‌ ఈరోజు స్పీకర్‌ సి.పి.జోషికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనర్హత విషయంలో వీరివురు కోర్టులో తలపడుతున్న విషయం తెలిసిందే. ‘‘రాజస్థాన్‌ స్పీకర్‌ సి.పి.జోషికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. స్పీకర్‌ నిర్ణయాన్ని సచిన్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అనర్హత నోటీసులపై యథాతథస్థితిని కొనసాగించాలని తీర్పు వెలువరించింది. 

మరోవైపు ఈ విషయంలో హైకోర్టు పరిధిని ప్రశ్నిస్తూ స్పీకర్‌ సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు స్పీకర్‌ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని వెల్లడించింది. దీంతో అనర్హత విషయంలో వ్యవహారం సచిన్‌ పైలట్‌ వర్సెస్‌ స్పీకర్‌ అన్నట్లుగా మారింది.  

మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులలైన గోవింద్‌ సింగ్‌ దోస్తారా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. నేటి మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరగున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సీఎం అశోక్‌ గహ్లోత్‌ కూడా హాజరుకానున్నారు. 

బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్‌ చేస్తూ ఆ పార్టీ హైకోర్టులో బుధవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ విషయంపై భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ వేసిన పటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రెండోసారి వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని.. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని