పూర్తిస్థాయి నాయకత్వం అవసరం: థరూర్‌

తాజా వార్తలు

Published : 09/08/2020 21:27 IST

పూర్తిస్థాయి నాయకత్వం అవసరం: థరూర్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ లోపంతో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ త్వరగా ఒక పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఇప్పటికే సరైన నిర్దేశకులు లేక కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనే భావన ప్రజల్లో నెలకొందని, దానిని పోగొట్టాలంటే అధ్యక్షుడి ఎన్నిక జరగాలని అన్నారు. ‘‘తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాను. కానీ ఆమెపై ఇంతటి భారం మోపడం ఎంత వరకు సమంజసం. అందుకే పార్టీ నాయకత్వంపై కచ్చితమైన నిర్ణయంతో మనం ముందుకెళ్లాలని భావిస్తున్నాను. నాయకత్వ లోపంతో కాంగ్రెస్‌ ఇబ్బందులు పడుతూ, ప్రతిపక్ష పార్టీ పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదంటూఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే అధ్యక్ష ఎన్నిక జరగాలి’’ అని థరూర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సమర్థుడని, పార్టీని ముందుండి నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని థరూర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆయన కరోనా వైరస్‌, సరిహద్దుల్లో చైనా వ్యవహారం గురించి ప్రభుత్వ వైఫల్యాలను ఎంతో బాగా ప్రశ్నించారని, ముందుచూపుతో రాహుల్ పనిచేస్తున్నారని  అన్నారు. అందుకే ఆయన మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. ఒక వేళ రాహుల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తే త్వరగా కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆగస్టు 10 తేదీతో సోనియా గాంధీ పదవి గడువు ముగియనుండటంతో కాంగ్రెస్‌లో మరో సారి అధ్యక్ష ఎన్నికపై చర్చ మొదలైంది.

మరికొంత కాలంపాటు సోనియానే... 

కొత్త అధ్యక్ష ఎన్నికపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపై కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షరాలిగా మరికొంత కాలం పాటు సోనియా గాంధీనే కొనసాగుతారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘సోనియా గాంధీ పదవి కాలం రేపటితో ముగినుందనేది వాస్తవం. అయితే తిరిగి తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతారు. అయితే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఎంతో దూరంలో లేదు’’ అని అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని