ఖాళీ చేయిస్తారా?మమ్మల్ని చేయించమంటారా?

తాజా వార్తలు

Updated : 12/09/2020 15:41 IST

ఖాళీ చేయిస్తారా?మమ్మల్ని చేయించమంటారా?

భాజపా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లోని మురికివాడలను, రైల్వేట్రాక్‌ వెంబడి ఉన్న గుడిసెలను ఖాళీ చేయించే అంశం అధికార ఆమ్‌ ఆద్మీ, భాజపాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఇది చినికి చినికి గాలివానలా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి మూడు నెలల్లోగా వాటిని ఖాళీ చేయించాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. అక్కడి ప్రజల కోసం ప్రత్యేకంగా కేంద్రం నిర్మించిన 52,000 ఇళ్లల్లో పునరావాసం కల్పించాలని కోరింది. అయితే దీనిని ఆప్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. కేంద్రం నోటీసులను ఆ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్‌ చందా చించిపారేసిన విషయం తెలిసిందే.

ఈ చర్యను భాజపా తీవ్రంగా పరిగణించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తారా? అని ఆప్‌ను ప్రశ్నించింది. కేంద్రం విధించిన గడువులోగా ఆ మురికివాడలను ప్రభుత్వం ఖాళీ చేయించకపోతే, తామే స్వయంగా చేయిస్తామని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా ఆప్‌కు హుకుం జారీ చేశారు. ‘‘ ఇలాంటి పరిస్థితుల్లో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కేవలం ముఖ్యమంత్రిగా కాదు.. ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా వ్యవహరించాలి. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయకూడదు’’ అని హితవు పలికారు. ఒక వేళ ఆప్‌ ప్రభుత్వం ఆ మురికి వాడలను ఖాళీ చేయించకపోతే.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ పని చేస్తుందని ఆయన హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని