అమరావతిలోనే రాజధాని: సోమువీర్రాజు

తాజా వార్తలు

Published : 15/12/2020 01:46 IST

అమరావతిలోనే రాజధాని: సోమువీర్రాజు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఇందులో మరో ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని, రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలోనే ఉంటాయని ఆయన అన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్‌ సంఘ్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిలో అద్భుత రాజధానిని భాజపా నిర్మించి ఇస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని ఆయన చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రూ. 2 వేల కోట్లతో భాజపా అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్ట్రంలోనూ భాజపాను గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో డిఫెన్స్‌ అకాడమీ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా వీర్రాజు వివరించారు.

ఇవీ చదవండి..

యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు: జగన్‌

ఈనెల 18న ఏపీ కేబినెట్‌ భేటీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని