ఆ ప్రచారం అపోహ మాత్రమే: సోము వీర్రాజు

తాజా వార్తలు

Published : 28/12/2020 01:19 IST

ఆ ప్రచారం అపోహ మాత్రమే: సోము వీర్రాజు

వ్యవసాయ చట్టాలపై విపక్షాలు మభ్యపెడుతున్నాయని విమర్శ

మంగళగిరి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్యపెడుతున్నాయని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నిర్వహించిన భాజపా రైతు సాధికార సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కొత్త చట్టాల విషయంలో రైతులు ఐదు అంశాలపై ఉద్యమిస్తున్నారని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లు మూతపడతాయనే ప్రచారం అపోహ మాత్రమేనని చెప్పారు. రైతుల భూములకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. రైతులకు నిర్దేశించిన ధరను గడువులోగా చెల్లించపోతే జరిమానా విధిస్తారని వీర్రాజు వివరించారు. చాలా రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయ విధానం అమల్లో ఉందని ఆయన గుర్తు చేశారు.

ఇవీ చదవండి..

విశాఖ తూర్పులో 144 సెక్షన్‌​​

జగన్‌ పిల్లలకే విదేశీ చదువులా?: లోకేశ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని