రాజధానిపై రాంమాధవ్‌ ఏమన్నారంటే?

తాజా వార్తలు

Updated : 11/08/2020 14:02 IST

రాజధానిపై రాంమాధవ్‌ ఏమన్నారంటే?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఎదగాలని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాంమాధవ్‌ మాట్లాడుతూ.. ఐడియాలజీతో పాటు సంస్ధాగతమైన వ్యవస్థతో ముందుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వివరించారు. 

 సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసుకుంటూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 2024లో అధికారంలోకి రావాలంటే రాబోయే నాలుగేళ్లు కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు. అందరం కలిసి పనిచేస్తే 2024లో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.

రాజధానిపై ఏమన్నారంటే?

‘‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పాం. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్పలేదు. నిధులు కేటాయించి ప్రోత్సహించాం.. యూనివర్సిటీలు పెట్టాం. ఇప్పుడు మూడు రాజధానులు అంటే ... కేంద్రం జోక్యం చాలా పరిమితం. ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని భాజపా ప్రశ్నించింది. 3 రాజధానుల పేరుతో మళ్లీ అవినీతి చేస్తే భాజపా పోరాడుతుంది. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు భాజపా ముందుండి పోరాడాలి’’ అని రాంమాధవ్‌ అన్నారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ...జాతీయ వాదంతో కూడిన రాజకీయ వ్యవస్థ రాష్ట్రానికి కావాలన్నారు. మంచి పాలన, అభివృద్ధి ఇవ్వాలనేది భాజపా లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని