రైతులను ఆదుకోవాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 30/11/2020 10:54 IST

రైతులను ఆదుకోవాలి: చంద్రబాబు

అమరావతి: పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరి కంకుల్ని చేతబట్టి తెదేపా నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరఫున ఆందోళనలు చేశారు. అన్నదాతలకు కలిగిన నష్టాన్ని తెలిపే రీతిలో వర్షానికి దెబ్బతిన్న పంట కంకులతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అంతకుముందు వెంకటపాలెం బీసీ కాలనీలో ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని