బాధితులకు రూ.10వేలు ఇవ్వాలి:చంద్రబాబు

తాజా వార్తలు

Published : 26/08/2020 01:28 IST

బాధితులకు రూ.10వేలు ఇవ్వాలి:చంద్రబాబు

హైదరాబాద్‌: ఏపీలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రెండువారాలు దాటుతున్నా గోదావరి వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా మద్దతుదారులకే అండగా ఉంటామని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంటే తిరుగుబాటు తప్పదన్నారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే గోదావరి పరీవాహక ప్రజలకు ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి సమయానికి కిందికి నీరు వదలడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసరాలతో పాటు హుద్‌హుద్‌, తిత్లీ సమయంలో తాము ఇచ్చిన ప్యాకేజీలు ఇప్పుడు వరద బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. బాధితులకు సాయం చేయకుండా రాజకీయం చేస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని