శాంతిభద్రతలు క్షీణించాయి:చంద్రబాబు

తాజా వార్తలు

Published : 02/09/2020 01:48 IST

శాంతిభద్రతలు క్షీణించాయి:చంద్రబాబు

నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీకి లేఖ

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల కాలంలో దళితుల అనుమానాస్పద మరణాలు, మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను చంద్రబాబు కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితికి చేరాయన్నారు. దోపిడీదారులు, గూండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం.. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన దాడుల్లో అధికార పార్టీ చెందినవారు ఉన్నందునే వాళ్ల పాత్ర బయటకు రానివ్వకుండా పోలీసులే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన ఎం.నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షీణించిన శాంతి భద్రతలను ఈ దుర్ఘటనలే స్పష్టం చేశాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికే ఫోర్త్ ఎస్టేట్ మీడియా అని.. అలాంటిది జర్నలిస్ట్‌లపై విచ్చలవిడి దాడులు కొనసాగితే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుందన్నారు. ఇలాంటి దాడులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని