‘బెంజ్‌ మినిస్టర్‌ జయరాం’ అంటూ లోకేశ్‌ వీడియో

తాజా వార్తలు

Updated : 18/09/2020 17:44 IST

‘బెంజ్‌ మినిస్టర్‌ జయరాం’ అంటూ లోకేశ్‌ వీడియో

అమరావతి: ఈఎస్‌ఐ స్కామ్‌ వెనుక అసలు సూత్రధారి మంత్రి గుమ్మనూరు జయరాం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి మాత్రం ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితుడు ఇచ్చిన బెంజ్‌ కారులో విలాసంగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ‘బెంజ్‌ మినిస్టర్‌ జయరాం‌’ అంటూ ఓ వీడియోను లోకేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజ్‌కారు బహుమతిగా ఇచ్చారంటూ తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని అయ్యన్న విమర్శించారు. దీనిపై మంత్రి జయరాం స్పందిస్తూ అయ్యన్న వ్యాఖ్యలను ఖండించారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అయ్యన్న చెప్పిన బెంజ్‌ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. 

 

ఇవీ చదవండి..

‘ఏపీ మంత్రి కుమారుడికి బెంజికారు లంచం’

నా కుమారుడికి లక్షల్లో ఫ్యాన్స్‌: ఏపీ మంత్రిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని