సిక్కోలును విభజించవద్దు: రామ్మోహన్‌నాయుడు

తాజా వార్తలు

Published : 09/11/2020 02:04 IST

సిక్కోలును విభజించవద్దు: రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 జిల్లాల ఏర్పాటు అసంబద్ధ ఆలోచనగా ఆయన అభిప్రాయపడ్డారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాలు మారితే ఏం చేస్తారని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాను విభజిస్తే తమ ప్రజల ఐక్యతను దెబ్బతీసినట్లేని.. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. జిల్లాను విభజించవద్దని.. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని రామ్మోహన్‌నాయుడు కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని