‘చంచల్‌గూడ చరిత్ర’.. డైరెక్టర్‌ శకుని మామ! 
close

తాజా వార్తలు

Updated : 11/07/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చంచల్‌గూడ చరిత్ర’.. డైరెక్టర్‌ శకుని మామ! 

వైకాపాపై తెదేపా నేతల విమర్శలు

అమరావతి: ఏడాది పాలన తర్వాత వైకాపా ప్రభుత్వాన్ని క్యాడర్‌ నుంచి లీడర్‌ వరకు అంతా  చీత్కరించుకుంటున్నారని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ‘చంచల్‌గూడ చరిత్ర ’పుస్తకం సగంలో  ఆగిందని.. దానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం శకుని మామే! అని ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు సీఎం  జగన్‌ తనను నమ్ముకున్న వాళ్లని మోసం చేశారని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి  కోసం పార్లమెంట్‌ సీటును త్యాగం చేసిన బాబాయ్‌ హత్య కేసులో ఉదాసీనత చూపారని ఆరోపించారు. జగన్‌  సీఎం కావాలని తపించిన మాజీ సీఎస్‌ ఎల్వీసుబ్రహ్మణ్యం,ఆజేయకల్లం తదితరులకు ఆశాభంగమే  ఎదురైందన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?: బొండా
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, యనమల, అచ్చెన్న, కొల్లు రవీంద్రపై ఎలాంటి కేసులు లేవని, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే వీరిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష పార్టీపై వివక్ష చూపుతున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని