విశాఖకు వైకాపా చేసిందేమీలేదు: అయ్యన్న

తాజా వార్తలు

Updated : 15/11/2020 11:48 IST

విశాఖకు వైకాపా చేసిందేమీలేదు: అయ్యన్న

అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేదుకు పోలవరం ఆ పార్టీ నేతల ఇంటి ప్రహరీ కాదని ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు వైకాపా చేసిందేముంది? అని నిలదీశారు. ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైకాపా చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని