తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

తాజా వార్తలు

Published : 13/11/2020 16:40 IST

తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాదా బైనామాల చట్టసవరణ కోసం ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించే వీలుంది. మరోవైపు సన్నరకం ధాన్యానికి బోనస్‌ ఇచ్చే అంశంపై చర్చించడంతో పాటు గవర్నర్‌ కోటాలో ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌లో జరిగిన నష్టాలు, జిల్లాల్లో పంట నష్టాలు, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, కరోనా నేపథ్యంలో ఆదాయాలు తగ్గినందున తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని