అక్కడ చెల్లని ఉత్తమ్‌ మాట దుబ్బాకలో చెల్లుతుందా?

తాజా వార్తలు

Published : 13/10/2020 01:58 IST

అక్కడ చెల్లని ఉత్తమ్‌ మాట దుబ్బాకలో చెల్లుతుందా?

మంత్రి హరీశ్‌రావు విమర్శలు

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, భాజపాలకు డిపాజిట్‌ కూడా దక్కదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజూర్‌నగర్‌, నిజామాబాద్‌ ఫలితాలే దుబ్బాకలో పునరావృతమవుతాయని చెప్పారు. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన ఓటమిపాలైన కాంగ్రెస్‌ నేత మద్దుల నాగేశ్వర్‌రెడ్డి తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, భాజపాపై విమర్శలు గుప్పించారు. 

హుజూర్‌నగర్‌లో సొంత సీటును గెలిపించుకోలేని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌.. దుబ్బాకలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారట అని హరీశ్‌ ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో చెల్లని ఉత్తమ్‌ మాట.. దుబ్బాకలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వకుండా చంపితే.. ఇప్పుడు భాజపా మీటర్లు పెట్టి చంపుతానంటోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎదురు చూస్తుంటే.. దాన్ని అడ్డుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం చేసినా అడ్డుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారని హరీశ్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం ఏం చేద్దామన్నా వద్దంటున్నందుకే ప్రజలు కూడా కాంగ్రెస్‌ను వద్దనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని