డైలీ సీరియల్‌లా మాట్లాడలేను: తలసాని

తాజా వార్తలు

Updated : 21/09/2020 15:27 IST

డైలీ సీరియల్‌లా మాట్లాడలేను: తలసాని

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్దకు ఎవరైనా వెళ్లి చూడొచ్చు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు కట్టి తీరుతామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై డైలీ సీరియల్‌లా మాట్లాడటం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ మొత్తం 111 చోట్ల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సహా ఎవరైనా అక్కడికి వెళ్లి చూడొచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో స్థలాలు లేక నగరం వెలుపల నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

బయట కడుతున్న ఇళ్లలో స్థానికులకు పది శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు 90 శాతం కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ హైదరాబాద్‌ బయట ఇళ్లు కట్టేందుకు జీవోలు ఇచ్చారని ఈ సందర్భంగా తలసాని గుర్తు చేశారు. సొంత స్థలం ఉంటే ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కరోనా పరిస్థితుల వల్ల ఇళ్ల నిర్మాణంలో కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. కోటి జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు లక్ష ఇళ్లపైనే ఎందుకు మాట్లాడతామని తలసాని ప్రశ్నించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని