‘థరూర్‌.. ఓ గెస్ట్‌ ఆర్టిస్ట్‌’

తాజా వార్తలు

Published : 29/08/2020 01:08 IST

‘థరూర్‌.. ఓ గెస్ట్‌ ఆర్టిస్ట్‌’

కాంగ్రెస్‌ సీనియర్లపై కొనసాగుతున్న విమర్శలు

తిరువనంతపురం: పార్టీలో సంస్థాగత ప్రక్షాళన, పూర్తిస్థాయి నాయకత్వం ఎన్నిక అంశాలతో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్లు రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న యూపీకి చెందిన జితిన్‌ ప్రసాద్‌ను బహిష్కరించాలన్న డిమాండ్‌ తెరపైకి రాగా.. ఇవాళ కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్‌పై ఆ పార్టీ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొడుక్కున్నిల్‌ సురేశ్‌ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయనో అతిథి కళాకారుడని దుయ్యబట్టారు. ‘శశి థరూర్‌ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి ఓ గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా వచ్చారు. ప్రస్తుతం అలానే కొనసాగుతున్నారు’’ అని విమర్శలు చేశారు.

‘‘ఆయనో గ్లోబల్‌ లీడర్‌ కావొచ్చు. అంత మాత్రన తన ఇష్టమొచ్చింది మాట్లాడడం, ఇష్టం మొచ్చింది చేయడం సరికాదు. పార్టీ విధానాలను అనుసరించాల్సిందే’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల తిరువనంతపురం విమానాశ్రయాన్ని అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 50 ఏళ్ల లీజుకు ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో థరూర్‌పై ఆ పార్టీ రాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో లేఖాంశం కూడా తోడవ్వడం ఆయనపై విమర్శలు పెరుగుతున్నాయి. అయితే, లేఖ అంశంపై చర్చను ఇంతటితో ముగించాలని శశి థరూర్‌ పార్టీ నేతలను కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని