బెంగాల్‌లో రాజకీయ రగడ
close

తాజా వార్తలు

Updated : 23/12/2020 23:33 IST

బెంగాల్‌లో రాజకీయ రగడ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), భాజపా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య పరస్పర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తూర్పు మెదినిపుర్‌ జిల్లా రాంనగర్‌ ప్రాంతంలో బుధవారం తృణమూల్‌, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురు గాయపడ్డారు. తృణమూల్‌ పార్టీ కార్యాలయం మీదుగా భాజపా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ గొడవ తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే గొడవలకు మీరంటే మీరే కారణమంటూ ఇరు పార్టీల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించుకున్నారు.

ఇవీ చదవండి...

రైతులకు మమతా బెనర్జీ ఫోన్‌

బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని