‘నేను రబ్బర్‌ స్టాంప్‌లా ఉండాలనేదే వారి కోరిక ’

తాజా వార్తలు

Published : 30/09/2020 01:39 IST

‘నేను రబ్బర్‌ స్టాంప్‌లా ఉండాలనేదే వారి కోరిక ’

పశ్చిమ్‌ బంగా సీఎంపై గవర్నర్‌ జగదీప్‌ విమర్శలు

కోల్‌కతా: పశ్చిమ్ బంగా గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరోసారి సీఎంపై గవర్నర్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల సమాచారం కోరినా మమతా బెనర్జీ స్పందించకపోవడంపై గవర్నర్‌  అసహనం వ్యక్తం చేశారు. ‘‘గవర్నర్‌ను పోస్టాఫీసుగా, రబ్బర్‌ స్టాంప్‌గా ఉండాలని ముఖ్యమంత్రి కోరుతున్నట్లు ఉంది. రాజ్‌భవన్‌కే పరిమితం చేయాలని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అందుకే రాజ్యాంగం ఏం చెబుతుందో సీఎంకు గుర్తు చేయాలనుకుంటున్నాని ఆర్టికల్‌ 167ను ఉటంకించారు. గవర్నర్‌కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులను తెలియజేసే నిబంధన. అయితే వివిధ అంశాలపై సమాచారం కావాలని లిఖిత పూర్వకంగా అడిగినా ఇంత వరకు స్పందన రాలేదని ఆక్షేపించారు. గవర్నర్ అభ్యర్థనలను ప్రభుత్వం విస్మరించిందని, దీని వల్ల ప్రజలకు నిజమైన సమాచారం తెలియదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు క్షీణించడంపై ఇంతకుముందే డీజీపీకి లేఖ రాశానని ఆయన తెలిపారు. పోలీస్‌ వ్యవస్థను ఉపయోగించుకుని విపక్షాలపై దాడులకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఓ పోలీసు అధికారి బెదిరింపులకు దిగినట్లు సీఎం మమతా బెనర్జీకి ప్రతిపక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ లేఖ రాసినట్లు గవర్నర్‌ గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆ లేఖకు సమాధానం కూడా ఇవ్వలేదని, తర్వాత అబ్దుల్‌ మన్నన్‌ తనకు లేఖ రాసినట్లు  వివరించారు. ఈ విషయంపై తాను కూడా సీఎంకు లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని గవర్నర్‌  విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని