బిహార్‌: ఎన్డీయే గెలిస్తే.. సీఎం నితీశేనా?

తాజా వార్తలు

Published : 10/11/2020 12:40 IST

బిహార్‌: ఎన్డీయే గెలిస్తే.. సీఎం నితీశేనా?

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఫలితాల సరళి ప్రకారం ఎన్డీయే కూటమి 130 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు మహాకూటమి కూడా 102 చోట్ల ఆధిక్యంతో ఎన్డీయేకు తీవ్ర పోటీ ఇస్తోంది. అయితే 27 స్థానాల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య తేడా కేవలం 500 నుంచి 1000 ఓట్ల లోపు మాత్రమే ఉండటంతో ఆధిక్యాలు మారుతూ వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఒకవేళ బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనేది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ హవా తగ్గింది. ఆధిక్యంలో ఈ పార్టీ మూడో స్థానంలో ఉంది. దీంతో ఎన్డీయే గెలిస్తే నితీశ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్నదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే చర్చలు జరుపుతుందని భాజపా నేత ఒకరు మీడియాకు చెప్పడం పై అనుమానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది.

అయితే నితీశ్‌ మళ్లీ సీఎం అవుతారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే తప్పకుండా విజయం సాధిస్తుందని, నితీశ్‌ మళ్లీ సీఎం అవుతారని ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇవే తన చివరి ఎన్నికలని నితీశ్ ఇటీవల స్వయంగా ప్రకటించడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని