బిక్కవోలులో సత్యప్రమాణం చేసిన నేతలు

తాజా వార్తలు

Updated : 24/12/2020 03:33 IST

బిక్కవోలులో సత్యప్రమాణం చేసిన నేతలు

బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. నేతలు పరస్పరం చేసుకున్న ఆరోపణలపై సత్యప్రమాణానికి సిద్ధమైన నేపథ్యంలో బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సతీమణి ఆదిలక్ష్మితో.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన సతీమణి మహాలక్ష్మితో కలిసి సత్యప్రమాణం చేశారు. ప్రమాణం చేస్తున్న సమయంలోనూ ఇరువురు నేతలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఆ సమయంలో గుడిలో ఒకింత గందరగోళం నెలకొంది. మధ్యలో పోలీసులు కలుగజేసుకుని నేతలకు సర్దిచెప్పారు. నేతల సవాళ్ల నేపథ్యంలో బిక్కవోలు, అనపర్తి మండలాల్లో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పోలీసు చట్టాన్ని అమలు చేశారు. కార్యకర్తలు గుమిగూడి ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నేతలు సత్యప్రమాణం చేసే సమయంలో మీడియాను పోలీసులు ఆలయంలోకి అనుమతించలేదు.

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మైనింగ్‌ సహా పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని రామకృష్ణారెడ్డికి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో నేతలిద్దరూ ఈరోజు సత్యప్రమాణం చేశారు. 

ఇదీ చదవండి..  తూర్పుగోదావరిలో వేడెక్కిన రాజకీయంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని