రైతుల నోళ్లలో మట్టి కొడతారా?: యనమల

తాజా వార్తలు

Published : 01/10/2020 14:13 IST

రైతుల నోళ్లలో మట్టి కొడతారా?: యనమల

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్‌పై జగన్‌ కన్నేయడం ఇవాళ్టిది కాదని అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులైన రైతుల నోళ్లలో మట్టికొట్టడం హేయమైన చర్య అని ఆక్షేపించారు. రూ.5వేల కోట్ల విలువైన కోనసీమ భూములు బినామీల పేర్లతో జగన్‌ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. కాకినాడ సెజ్‌ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లని.. అందులో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని ఆయన అన్నారు. అవినీతి లావాదేవీలపై దర్యాప్తు జరపాలని, పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ పెడితే కోనసీమ ప్రాంతం కాలుష్యమై వందలాది హేచరీస్‌ అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి నెల్లూరు దాకా మొత్తం కోస్తా తీరాన్ని కబళిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే విశాఖ సెజ్ లో సీఎం బినామీలు పాగా వేసి ఉత్తరాంధ్ర భూములన్నీ కబ్జా చేశారని ధ్వజమెత్తారు. త్వరలో బందరు పోర్టు కూడా జగన్ బినామీల పరమవుతుందేమోనని వ్యాఖ్యానించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని