ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు: యనమల

తాజా వార్తలు

Published : 01/11/2020 01:25 IST

ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు: యనమల

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణడు ఖండించారు. శాంతియుత నిరసనలు అడ్డుకోవడం గర్హనీయమన్నారు. ‘ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా? జగన్‌ రూల్‌ ఆఫ్‌ లా ప్రత్యేకంగా తెచ్చారా?’ అంటూ ప్రభుత్వాన్ని యనమల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణచివేత ఏపీలో అమలవుతోందని మండిపడ్డారు. 

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్న యనమల.. రాజ్యాంగ హక్కులను హరించివేశారని విమర్శించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ సందర్భంగా యనమల విజ్ఞప్తి చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని