టీఎంసీలో చేరనున్న ప్రణబ్ తనయుడు!

తాజా వార్తలు

Updated : 05/07/2021 14:16 IST

టీఎంసీలో చేరనున్న ప్రణబ్ తనయుడు!

కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో చేరేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు.. నేటి సాయంత్రానికల్లా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తృణమూల్ నాయకత్వంతో అభిజిత్ ముఖర్జీ గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఆయన కలుసుకున్నారు. మరోవైపు కోల్‌కతాలో చోటుచేసుకున్న నకిలీ టీకా కార్యక్రమంపై పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. నకిలీ టీకా కార్యక్రమానికి మమతా బెనర్జీని నిందించాల్సి వస్తే.. నీరవ్‌మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ చేసిన కుంభకోణాలకు మోదీజీని బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

అభిజిత్ ముఖర్జీ గతంలో కాంగ్రెస్ తరఫున జంగిపూర్ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని