తమిళనాట 20 స్థానాల్లో భాజపా బరిలోకి!
close

తాజా వార్తలు

Updated : 06/03/2021 15:55 IST

తమిళనాట 20 స్థానాల్లో భాజపా బరిలోకి!

చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, అన్నాడీఎంకేల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తులో భాగంగా భాజపాకు అధికార అన్నాడీఎంకే 20 స్థానాలు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు పార్టీల సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు.  అన్నాడీఎంకే తరపున పార్టీ కోఆర్డినేటర్‌, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, సీఎం ఈ పళనిస్వామి, భాజపా తరపున రాష్ట్ర ఇన్‌ఛార్జి సీటీ రవి, స్టేట్‌ యూనిట్‌ చీఫ్‌ మురుగన్‌ సంతకం చేశారు. మరో ప్రాంతీయ పార్టీ అయిన పీఎంకేకు పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 23 స్థానాలు కేటాయించింది.

అయితే భాజపా పోటీ చేయబోయే స్థానాల పేర్లపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ మరణంతో ఖాళీ అయిన కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని సైతం భాజపాకే కేటాయించారు. ఇదిలా ఉండగా.. పొత్తులో భాగంగా నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే పార్టీకి స్థానాల కేటాయింపుపై అన్నాడీఎంకే తుది ప్రకటన చేయాల్సి ఉంది.

ఆరుగురితో తొలి జాబితా విడుదల

అన్నాడీఎంకే ఇప్పటికే ఆరుగురు సభ్యులతో తొలి జాబితా ప్రకటించింది. ఆ ఆరుగురిలో సీఎం పళనిస్వామి ఎడప్పాడి నుంచి, పన్నీర్‌సెల్వం బోడినయకనూర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మరో ఇద్దరు సీనియర్‌ మంత్రులు జయకుమార్‌, షణ్ముగమ్‌లు రాయపురమ్‌, విలుపురమ్‌ నుంచి బరిలో దిగనున్నారు.

కాగా, తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని