Akhilesh Yadav: డెంగీతో పిల్లలు చచ్చిపోతుంటే.. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటారా?

తాజా వార్తలు

Published : 07/09/2021 01:18 IST

Akhilesh Yadav: డెంగీతో పిల్లలు చచ్చిపోతుంటే.. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటారా?

లఖ్‌నవూ: రాష్ట్రంలో చిన్నారులు వైరల్‌ జ్వరాలు, డెంగీతో చనిపోతుంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అంతా బాగానే ఉందంటూ (ఆల్‌ ఈజ్‌ వెల్‌) తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. విష జ్వరాలు, డెంగీతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. రోగులతో ఆస్పత్రులన్నీ రద్దీగా మారాయని, సకాలంలో సరైన వైద్యం అందక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు దిగజారిపోతుంటే భాజపా దృష్టి పెట్టడంలేదని ఆక్షేపించారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో డెంగీ వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుందన్న అఖిలేశ్‌.. అది ఇప్పుడు తూర్పు ప్రాంతంలోనూ వ్యాపిస్తోందన్నారు.

రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలో ఆస్పత్రులు రద్దీగా ఉన్నాయని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఫిరోజాబాద్‌, మథుర, మెయిన్‌పూర్‌, కాన్పూర్‌, ఫరూఖాబాద్‌లలోనూ పరిస్థితి బాగా లేదని చెప్పారు. చిన్నారులను కోల్పోయిన తల్లుల రోదిస్తుంటే ప్రభుత్వం అంతా బాగానే ఉందని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. ప్రజారోగ్యం, సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న భాజపాపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందన్నారు. భాజపా తిరిగి ఎప్పటికీ అధికారంలోకి రాదని, ప్రతిఒక్కరూ సమాజ్‌వాదీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసంతో ఉన్నారని అఖిలేశ్‌ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని