అభ్యర్థులందరూ కోటీశ్వరులే!​​​​​​​

తాజా వార్తలు

Published : 24/02/2021 15:44 IST

అభ్యర్థులందరూ కోటీశ్వరులే!​​​​​​​

గతంకన్నా స్వల్పంగా పెరిగిన పల్లా ఆస్తులు

నల్గొండ: నల్గొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అభ్యర్థులు వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలివి.. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు కోటీశ్వరులే కావడం విశేషం.  

పల్లా రాజేశ్వర్‌రెడ్డి: తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి (57) ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం స్వల్పంగా పెరిగాయి. 2015 ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం ఆయన, భార్య పేరుతో మొత్తం రూ. 18.5 కోట్ల ఆస్తులుండగా. తాజా అఫిడవిట్‌ ప్రకారం వాటి విలువ రూ. 21 కోట్లకు చేరాయి. భార్య పేరుతో మారుతీ కారు ఉంది. రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలో రూ. 1.24 కోట్ల విలువైన 32 ఎకరాల భూమి పల్లా పేరుతో ఉండగా, ఆయన భార్య పేరుతో వరంగల్‌ జిల్లాలో 10.27 ఎకరాల భూమి ఉంది. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఇంటి నిర్మాణం కోసం డీడీ కాలనీ ఎస్‌బీఐ నుంచి రూ. 4.10 కోట్లు రుణం తీసుకున్నారు. 

గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి: హన్మకొండకు చెందిన భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (58) ఆస్తులు రూ. 3.63 కోట్లు. వరంగల్‌లోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఒక ధర్నా సందర్భంగా కేసు నమోదైంది. చేతిలో రూ. 18.84 లక్షలు ఉండగా, ఒక ఇన్నోవా వాహనం, రూ. 25.50 లక్షలు విలువ చేసే ఒక ట్యాంకర్‌ ఉన్నాయి. రూ. 86.79 లక్షల అప్పు ఉంది. 

ముద్దసాని కోదండరాం: హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ముద్దసాని కోదండరాం(65)కు రూ. 2.1 కోట్ల ఆస్తులున్నాయి. చేతిలో నగదు రూ. 5 లక్షలుండగా అప్పులు లేవు. ఎలాంటి నేర చరిత్ర లేదు. 

చెరుకు సుధాకర్‌: నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రానికి చెందిన తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ (65)కు రూ. 7.2 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన పేరుతో చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో 8.2 ఎకరాల భూమి ఉండగా, భార్య లక్ష్మి పేరుతో కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద 4 ఎకరాల భూమి ఉంది. సుధాకర్‌ పేరుతో రూ. 38 లక్షల అప్పు ఉండగా, భార్య పేరుతో రూ.1.09 కోట్ల అప్పు ఉంది. 

సభావత్‌ రాములు నాయక్‌: హైదరాబాద్‌లోని బంజారా కాలనీకి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ (56)కు రూ. 1.4 కోట్ల ఆస్తులున్నాయి. చేతిలో నగదు రూ. 1.5 లక్షలు ఉండగా, రెండు ఇన్నోవా వాహనాలున్నాయి. ఎలాంటి నేర చరిత్ర లేదు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని