ఇసుక అక్రమ తరలింపు ప్రాంతాన్ని పరిశీలించిన అఖిలపక్షం 

తాజా వార్తలు

Published : 25/06/2021 17:29 IST

ఇసుక అక్రమ తరలింపు ప్రాంతాన్ని పరిశీలించిన అఖిలపక్షం 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని పెన్నా కొత్త వంతెన సమీపంలో ఇసుక అక్రమ తరలింపు ప్రాంతాన్ని అఖిలపక్ష నేతలు శుక్రవారం సందర్శించారు. అధికార వైకాపాతోపాటు తెలుగుదేశం, భాజపా, జనసేన నేతలు ఇసుక తరలించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బయటి ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిపోయిందని తెలుగుదేశం నాయకులు ఆరోపించగా.. ప్రభుత్వ ఇళ్ల స్థలాలకే ఇసుక తరలించామని వైకాపా నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో కొందరి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మిగిలిన వారు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. నదిలో నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంతోపాటు ఎంత తరలించారు, ఇళ్ల స్థలాలకు ఎంత వినియోగించారో అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని