ఆలయాలపై దాడులు.. రాజకీయం చేయొద్దు!

తాజా వార్తలు

Published : 03/01/2021 02:02 IST

ఆలయాలపై దాడులు.. రాజకీయం చేయొద్దు!

దిల్లీ: ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అనేది రాజకీయం కాదని ధార్మికపరమైన అంశమని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ఆత్మాభిమానం, స్వాభిమానానికి అనుగుణంగా ఈ అంశాన్ని స్వీకరించడానికి భాజపా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. 

గత తెదేపా ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం వైకాపా అధికారంలోనూ శ్రీశైల పుణ్యక్షేత్రం అన్యమతస్థుల ఆధ్వర్యంలో నడుస్తుండటం భాజపా గమనించిందని సోము వీర్రాజు పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురాబోతున్నామన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తగు విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన వివరించారు. 

‘తెదేపా హయాంలో విజయవాడలో కొన్ని దేవాలయాలను కూల్చేశారు. వాటిని కడతామని కమిటీలు వేసి వాటిని కట్టలేదు. ఆ సమయంలోనే శ్రీశైలంలో అన్యమతస్థుడి చేత కార్యక్రమాలు చేయించారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల విషయంలో రెండూ ఒకటిగానే ఉన్నాయి’ అని సోము వీర్రాజు విమర్శించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై జనసేన, భాజపాకు పూర్తి క్లారిటీ ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఇవీ చదవండి..
రామతీర్థం రణరంగం

రామతీర్థం కోనేరును పరిశీలించిన చంద్రబాబు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని