దాడులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు

తాజా వార్తలు

Updated : 06/01/2021 14:43 IST

దాడులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

విశాఖపట్నం: రామతీర్థం ఆలయ పరిశీలనకు భాజపాకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం చేపట్టిన రామతీర్థం ధర్మయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై విశాఖలో భాజపా, జనసేన నిరసన చేపట్టాయి. ఇందులో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసంపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. రాష్ర్టంలో ఉన్న మెజార్జీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రామతీర్థం వెళ్లడానికి భాజపాను అనుమతించాలనేది మా ప్రధాన డిమాండ్‌. ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది’ అని సోము వీర్రాజు అన్నారు.

ఇవీ చదవండి..

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌

‘ఎమ్మెల్యే ఆదేశాలతోనే అంకులు హత్య’


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని